మండల కేంద్రంలో రెపరెపలాడిన ఎర్రజెండాలు

Published: Monday May 02, 2022
సిపిఎం, సిఐటియు, భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణలు
బోనకల్, మే 1 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు (మే డే)ను మరియు కార్మికుల, పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సిపిఎం పార్టీ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 109 వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా మండల కేంద్రంలో బొడ్రాయి సెంటర్ నందు జెండాను వార్డు నెంబర్ ఉప్పర శ్రీను ఎగరవేశారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు చెన్నా లక్షా ద్రి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్టీ కాలనీలో పార్టీ సీనియర్ నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ భూక్యా జాలు జెండాను ఎగరవేశారు. గిరిజన సంఘం మండల అధ్యక్షులు భూక్యా శ్రీను సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా సిఐటియు కార్యాలయంలో మండల కన్వీనర్ బోయిన్ పల్లి వీరబాబు జెండాను ఆవిష్కరించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు షేక్ ఖాదర్ బాబా(బుజ్జి) భవన నిర్మాణ కార్మికుల జెండాను ఎగరవేశారు. సిపిఎం పార్టీ  కార్యాలయంలో పార్టీ జెండాను మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరావు ఆవిష్కరించారు. సుందరయ్య చిత్రపటానికి మహిళా సంఘం అధ్యక్షురాలు మంద కళావతి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కార్మిక దినోత్సవ ఆవిర్భావం ఏ ఒక్క దేశం, సంఘటనకు పరిమితం కాదని, శ్రమదోపిడిని నిరసిస్తూ ప్రపంచ కార్మికుల లో స్ఫూర్తిని రగిలిస్తూ వేసిన ముందడుగు మే డే అని అన్నారు. 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవ ఫలితంగా అమెరికా యూరప్ దేశాలలో పరిశ్రమలు స్థాపించారని, కార్మికులకు కనీస సౌకర్యాలు లేకుండా రోజుకు 16 నుండి 18 గంటలు కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకునేవారని, దీన్ని నిరసిస్తూ 1886 లో చికాగో నగరంలో జరిగిన కార్మికుల ప్రదర్శనలో రోజుకు 8గంటలు పని దినం మాత్రమే ఉండాలని కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు తారాస్థాయికి చేరుకుందని, సమ్మె ఉధృతం అయ్యేసరికి యజమానులు పోలీసుల సాయం కోరి కార్మికుల పై జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనలో తిరిగి జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మరో ఏడుగురు చనిపోయారు. కాల్పులకు కార్మిక నాయకులు కారణమని వారిపై హత్య నేరం మోపి అరెస్టు చేశారాని, కార్మిక నాయకులను దోషులుగా నిర్ధారించిన కోర్టులు ఉరిశిక్ష అమలు చేశారు. అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు చోటుచేసుకున్నాయని, కార్మికుల ప్రదర్శన లో చనిపోయిన వారి గుర్తుగా మే 1న కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కుదుర్చుకోని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు మే డే ను జరుపుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బోనకల్ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు షేక్ ఖాదర్ బాబా (బుజ్జి), హమాలీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు తాళ్లూరు ఏసు, మండల వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, మహిళా సంఘం నాయకురాలు మందా కళావతి, సిపిఎం బోనకల్ గ్రామ శాఖ కార్యదర్శి తెల్లకుల శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బిళ్ళా విశ్వనాథం, చేన్నా లక్షా ద్రి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గుంటి శ్రీను, గద్దల శ్రీను, గంగుల వెంకటేశ్వర్లు, రాము, సిపిఎం నాయకులు ఏసు పోగు బాబు, గద్దె రామారావు, గిరిజన సంఘం మండల అధ్యక్షులు భూక్యా శ్రీను, వార్డు నెంబర్ ఉప్పర శ్రీను, ఇతర నిర్మాణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.