ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో ద్వితీయ భాష సంస్కృతం రద్దు చేయాలి.

Published: Tuesday July 13, 2021
ఇంటర్ విద్యలో సంస్కృత భాషను చెర్చడాని వెనక్కి తీసుకోవాలి: ఎస్.ఎఫ్.ఐ
మధుర, జులై 12, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిట SFI ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధుప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో, ఎయిడెడ్ కళాశాలలో రెండవ భాషగా సంస్కృత భాషను నేర్పాలనే ఇంటర్ కమీషనర్ ఉత్తర్వులను SFI ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు తీవ్రంగా వ్యతిరేకించారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ :- నిత్య జీవితంలో గానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గానీ ఉపయోగం లేని సంస్కృత భాషను విలులైన ఇంటర్మీడియట్ దశలో నేర్పి విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయ వద్దని ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కమిటీ కోరుతోంది. రెండవ భాషగా అమల్లో ఉన్న తెలుగు, ఉర్దూ భాషల కంటే సంస్కృత భాషకు ప్రాధాన్యత ఎందుకో ప్రభుత్వం చెప్పాలి.. సంస్కృత భాష మాటున పరోక్షంగా మను సంస్కృతిని ప్రోత్సాహించ వద్దని సూచిస్తున్నాను. అనుచితమైన ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుచున్నాము.కేవలం కార్పోరేట్ కళాశాలలు మాత్రమే మార్కుల కోసం ఈ కోర్సును అమలు చేస్తున్నాయని, సంస్కృతం నేర్చుకోవడం వల్లన  విద్యార్ధులకు ఓనగూరే ప్రయోజనం లేదు. ప్రభుత్వం మాతృభాషను విస్మరిస్తుంది. పాఠశాల విద్యలో తెలుగు మొదటి బాషగా ఉంటుందని ఎక్కువ మంది పేద విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు బాషను చదువుకోని ఇంటర్ లో రెండవ బాష సంస్కృతం వల్లన నష్టపోయ్యే అవకాశం ఉంది. కావున వెంటనే ఇంటర్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పేరు స్వామి, ప్రదీప్, రాహుల్, రుషి, ప్రణయ్, రాజు విజయ్ తదితరులు పాల్గొన్నారు