రాజీవ్ స్వగృహ భూముల వేలం పాట రద్దు చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.వాసువదేవ రెడ్డి

Published: Wednesday June 15, 2022
కరీంనగర్ జూన్ 14 ప్రజాపాలన ప్రతినిధి :
 
 
  తిమ్మాపూర్ లో ఉన్న రాజీవ్ స్వగృహ భూములను ఈనెల 20న జరిగే వేలం పాటను రద్దుచేసి అర్హులైన లబ్దిదారులు ఇవ్వాలని అఖిల పక్షం నేతలు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు.
 సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి  ఈ సందర్భగా ట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్రెడ్డి 2007 సంవత్సరంలో అందరికీ అందుబాటులో ఉండాలని మార్కెట్ రేటు కన్నా దాదాపు 20 శాతం తక్కువ ధరకు ఇళ్లు అని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మధ్యతరగతి ప్రజల నుండి ఆనాడు  2007 నుండి  2 సర్వే నిర్వహించి ఒక్కొక్క దరఖాస్తుదారు నుండి ఖరీదు రెండు వందల రూపాయలు మరియు ధరావత్తు 5 వేలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్జీలు స్వీకరించారు.  నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ వారు నేను బహిరంగ మార్కెట్లో వేలం ధర అమ్ముటకు ప్రయత్నించడం సిగ్గుచేటు కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇట్టి వేలం పాట ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు మధ్యతరగతి వారు ఏదైతే డబ్బులు కట్టడం ఇప్పుడు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోందని మండిపడ్డారు డబ్బులతో భూమి సేకరించి నందుకు భూమి చెందాలని డిమాండ్ చేశారు. రాజీవ్ స్వగృహ అధికారులలో ఇంటిస్థలం రాని వారికి 10 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలి 15 సంవత్సరాల కాలం తర్వాత వారి డిపాజిట్ 5‌వేల రూపాయలు తిరిగి చెల్లించడం తీవ్ర అన్యాయమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి రాజీవ్ స్వగృహ వేలం పాటను రద్దుచేసి మధ్యతరగతి ప్రజలకు భూములు చందే విధంగా కృషి జరగాలి అని హెచ్చరించారు. లేనిపక్షంలో రాజీవ్ స్వగృహ అర్జీ దారుల న్యాయం జరిగే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీ మద్దతు తెలుపుతూ ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు శనిగరపు  రజినీకాంత్ పార్టీ నగర నాయకులు కవ్వంపెళ్లి అజయ్,జి తిరుపతి,జి, శ్రీకాంత్,రైకంటి శ్రీనివాస్, కంపెళ్లి అరవింద్,రాకెష్,అభినయ,శ్రీనివాస్ నరేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.