బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయరాదు

Published: Tuesday November 08, 2022
జిల్లా ఉప వైద్య అధికారి డాక్టర్ జీవరాజ్
వికారాబాద్ బ్యూరో 7 నవంబర్ ప్రజా పాలన : బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం వల్ల ఇతరులు ఇబ్బంది పడతారని, వీటి వినియోగం వల్ల ఆరోగ్యం పాడవుతుందని జిల్లా ఉప వైద్య అధికారి డా.జీవరాజ్ అన్నారు.   పొగాకు ఉత్పత్తులు సిగరెట్, గుట్కా, జర్ద, పాన్ మసాలాల వినియోగం, వాటి వల్ల కలిగే దుష్పరిణామాలపై సోమవారం ప్రజలకు వికారాబాద్ బస్టాండ్, రైల్వే స్టేషన్ లలో  వైద్య శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.   డా. లలిత, మాతా శిశు ఆరోగ్య ప్రోగ్రాం అధికారి, డా. మరియా ఎన్ సిడి ప్రోగ్రాం అధికారి, రేణుకుమార్
 కో-  ఆర్డినేటర్, లక్ష్మి, జయరాం, మహేష్ ఆర్టీసీ మేనేజర్, శ్రీనివాస్ సిఐ, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.