ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 24ప్రజాపాలన ప్రతినిధి **సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృ

Published: Saturday February 25, 2023
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత 8సంవత్సరాల నుంచి ఎమ్మేల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందరికి అందుతున్నాయా? ఎవరైనా ఇంకా మిగిలిపోతున్నారా  ప్రతి గ్రామంలో, అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ.. గడప గడపకు తిరుగుతూ చేసిన పనులను వివరించటానికి.. చేయాల్సిన పనులను తెలుసుకోవటానికే ఈ ప్రగతి నివేదన యాత్ర. ప్రగతి నివేదన యాత్రను ఆనందీశ్వరుని ఆశీస్సులు తీసుకొని జనవరి 22న యాచారం మండలం నందివనపర్తి గ్రామం నుంచి ప్రారంభించి ఫిబ్రవరి 23న ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామానికి చేరుకోవటం జరిగింది. ఈరోజు వరకు 3మండలాలు, 33రోజులు 58గ్రామాలు, 439కిలోమీటర్లు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు,  అన్ని వర్గాల ప్రజల మద్దతుతో, మీడియా వారి సహకారంతో యాచారం, మంచాల,  ఇబ్రహీంపట్నం మండలాలలో ప్రగతి నివేదన యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోవటం జరిగింది. 439కిలోమీటర్లు నడిచింది నేనైనా, నడిపించింది ముమ్మాటికి మీరే అని ఈసంధర్బంగా తెలియజేస్తున్నాను.ప్రగతి నివేదన యాత్రకు అన్ని మండలాల నుంచి, అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు వస్తుందని, నేను ఉదయం గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఎండను సైతం లెక్క చేయకుండా, అదేవిధంగా కొన్ని గ్రామాలలో రాత్రిపూట 8, 9గంటలైనా అవ్వతాతలు, చంటిపాపలను ఎత్తుకొని మాఅక్కచెల్లెమ్మలు నాకోసం ఎదురు చూశారు అని బంటి తెలిపారు.  కొంతమంది నాయకులు కేవలం ఎన్నికల సందర్భంగా ఓట్లకోసం వస్తారు, ఓట్లు అయిపోగానే భయపడతారు. తిరిగి గ్రామంలో ఉన్న ప్రజలు, వారి సమస్యల గురించి తెలుసుకునే నాథులే ఉండరు, అందుకే ఈవ్యవస్థ, పరిస్థితులు మారాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టాలలో, ఇబ్బందులో తోడుగా ఉంటాను. ప్రగతి నివేదన యాత్రలో భాగంగా నేను గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. రైతన్నలను కలిసినప్పుడు మాకు పెట్టుబడి కోసం ఒకరి దగ్గర చేతులు చాచే పరిస్థితి లేకుండా రైతుబంధు వస్తుంది మా కష్టాలు తిరాయని, కొందరికి రైతుభీమా వచ్చింది కేసీఆర్ మమ్మల్ని ఆదుకున్నారని అన్నారు. అవ్వతాతలు మాకు ఫించన్లు వస్తున్నాయని.. ఈరోజు సీఎం కేసీఆరే మాకు పెద్దకొడుకని అన్నారు. ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఆస్పతత్రిలో చేరి లక్షల రూపాయలు ఖర్చు చేసిన వారికి ప్రభుత్వం సహయం చేసి ఆదుకోవటానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సీఏంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చారు దీంతో మాకు కేసీఆర్ ఆపద్భాందువుడని కొందరు అన్నారు.యువకులను అడిగితే.. ఫీజ్ రీయింబర్స్మెంట్ ద్వారా మేము ఉన్నత చదువులు చదువుతున్నామని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు, పోటీపరీక్షలకు చదువుకునేవారు ఏంకేఆర్ పౌండేషన్ ద్వారా ఉచితంగా కోచింగ్, ఫుడ్, మెటీరియల్ మరియు అన్ని రకాల వసతులను కల్పిస్తున్నారని అన్నారు.  ప్రగతి నివేదన యాత్ర యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో విజయవంతం కావటానికి సహకరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు  మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రగతి నివేదన యాత్ర రేపటి నుంచి ఆదిభట్ల మున్సిపాలిటీలోకి ప్రవేశిస్తుంది. కావున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మరియు మీడియా మిత్రులు ఇదేవిధంగా సహకరిస్తూ విజయవంతం చేయాలని కోరుతూ... ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల జెడ్పిటిసిలు. మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు, డైరెక్టర్స్,  మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్స్, వివిధ మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శిలు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీ ఆర్ ఎస్  గ్రామ అధ్యక్ష కార్యదర్శులు యువజన నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.