సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి*డాక్టర్ సుబ్బారావు

Published: Saturday October 15, 2022

మధిర రూరల్ అక్టోబర్ 14 (ప్రజా పాలన ప్రతి నిధి) ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా క్షయ నివారణ అధికారి మరియు మధిర డివిజన్ ప్రత్యేక అధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు సూచించారు. శుక్రవారం పట్టణంలో పలుచోట్ల నిర్వహిస్తున్న డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవ లేకుండా ప్రజలు ఉంచుకోవాలన్నారు. అదేవిధంగా నివాసాల్లో పాడైపోయిన కూలర్లు వాడేసిన కొబ్బరి బోండాలు టైర్లను తొలగించుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి సీజనల్ వ్యాధులు దరి చేరవన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి ఆరోగ్య సిబ్బంది పిహెచ్ఎన్ గోలి రమాదేవి హెచ్ఇఒ  గోవింద్ మాతా శిశు సంరక్షణ నోడల్ పర్సన్ కౌసెల్య టీబీ ఎయిడ్స్ లెప్రసీ నోడల్ పర్సన్ లంకా కొండయ్య ఎఎన్ఎమ్లు విజయలక్ష్మి విజయ కుమారి హెల్త్ అసిస్టెంట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.