సరైన నష్టపరిహారం ఇస్తేనే భూములు ఇస్తాం

Published: Friday February 12, 2021
లేదా ప్రాణాలైనా అర్పిస్తాం-భూ నిర్వాసితులు
 
వెల్గటూర్, మార్చ్12 (ప్రజాపాలన)  సరైన నష్టపరిహారం ఇస్తేనే మా భూములు కాళేశ్వరం లింక్ టు పంప్ హౌస్ కు భూములు ఇస్తాము లేదంటే మా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని భూమి కోల్పోతున్న వెల్గటూర్ మండలం రాజక్క పల్లి రైతులు గువారం రోజు పంప్ హౌస్ పనులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ భూమిలో పనులు నడుస్తున్నాయి ఇక్కడ నుండి  మా భూములకు వచ్చి పనులు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉపసర్పంచ్ సంఘ రామయ్య మాట్లాడుతూ ఇక్కడ భూమి విలువకు సమానంగా ప్రభుత్వం  మార్కెట్ ధర రోడ్ సైడ్ ఎకరాల 60 లక్షలు వ్యవసాయ భూములు మరియు కొంచెం లోపల సైడ్ ఎకరా 30 లక్షల నుండి నలభై లక్షలు నడుస్తుందని ఇట్టి భూమి సరైన నష్టపరిహారం చెల్లించే వరకు మా  భూములు ఇచ్చే ప్రసక్తే లేదని అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం అని పనులను అడ్డుకున్న సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు సరైన సమాధానం ఇవ్వకుండానే మా భూములలో పంప్ హౌస్ పనులు సంబంధించిన ఎలాంటికాల్వ పనులు చేయమని కరాఖండిగా చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుండి సరిఅయిన భూ  నష్టపరిహారం విషయం తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.