కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా చేస్తున్న ధర్నా ను జయప్రదం చేయండ

Published: Thursday November 11, 2021
సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రేగుంట చంద్రశేఖర్
బెల్లంపల్లి నవంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి : రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించక పోగా పండించిన పంటను కోనడంలో అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 12న బెల్లంపల్లి ఆర్డిఓ కార్యాలయం ముందు చేపట్టదలచిన ధర్నాకు నియోజకవర్గ రైతులందరూ అధిక సంఖ్యలో హాజరై ధర్నాను జయప్రదం చేయాలని బెల్లంపల్లి నియోజకవర్గ భారత కమ్యూనిస్టు పార్టీ ఇంచార్జ్, రేగుంట చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం నాడు స్థానిక బాబు క్యాంపు బస్తి ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్, బిజెపి పార్టీలు రాజకీయ కక్షలతో ఒకరినొకరు తిట్టుకుంటూ వరి పండించే రైతులను ఉరికొయ్యలకు వెలాడేటట్లుగా చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడే వరకు ఒక మాట ఏర్పడినాక ఒక మాట మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కెసిఆర్ తుగ్లక్ పరి పాలన చేస్తున్నాడని, ఆరువేల ఎనిమిది వందల 32 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి చివరి వరి ధాన్యం గింజ వరకు కొంటా అని చెప్పిన కేసీఆర్ అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు ఒక లక్షా 50 వేల కోట్లతోని నిర్మించిన ఈ నీటిని లక్షల ఎకరాలకు అందించి రైతులను ఆదుకుంటాం అన్న కేసీఆర్  ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం వరి పండుతుంది అని చెప్పి, ఏ చెరువులు అయితే తెలంగాణలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా ఆ చెరువుల్లో కి నింపారో ఆ నీళ్లతో వరి తప్ప వేరే పంట పండుతుందా, కాలువల కింద భూముల్లో వరి తప్ప ఇంకేమైనా పంట పండుతుందా అని ఆయన ప్రశ్నించారు. వరి ధాన్యాన్ని కేంద్రం కొనటం లేదని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం కోనటం లేదని కేంద్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు సాకులు చెపుతూ రైతులకు గిట్టుబాటు ధర కలిపించకుండ నలభై కిలోల ధాన్యానికి మూడు కిలోల తరుగు తీసేస్తూ, డీజిల్, పెట్రోల్, రేట్లు పెంచుతూ, కూలి రేట్లు పెరిగి గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసు కుంటున్నారని, ఈ కరోనా కష్టకాలంలో పండించిన పంటను కూడా కోనం అంటే ఈ రాష్ట్రం ఎటు పోతుందని, ఈ బంగారు తెలంగాణ ఎవరి కోసమని ఆయన అన్నారు. రైతన్న దేశానికి వెన్నుముక అని అన్న కేసీఆర్ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే రైతుల, నిరుద్యోగుల ప్రాణాలతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెలగాట మాడుతున్నాయని  దీనికి నిరసనగా ఈనెల 12వ తేది శుక్రవారం నాడు స్థానిక ఆర్డీవో కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలో నియోజకవర్గ రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రేగుంట చంద్రశేఖర్ బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చిప్ప నరసయ్య, పట్టణ కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం, మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు అక్కే పెళ్లి బాపు, బొంకూరి రామచందర్, మూల శంకర్ గౌడ్, రత్నం రాజమ్, బండారి శంకర్. తదితరులు పాల్గొన్నారు.