పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి : సిపిఐ డిమాండ్.

Published: Saturday March 26, 2022
మధిర మార్చి 25 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడుసిపిఐ పట్టణ మండల కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు RV కాంప్లెక్స్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు బెజవాడ రవి, ఊట్ల కొండలరావు లు ధర్నా నుద్దేశించిమాట్లాడుతూ కేంద్రం లో మోడీ ప్రభత్వం వచ్చిన దగ్గరనుంచి ప్రజలపై విపరీతమైన పన్నులభారాన్ని మోపుతున్నారని విమర్శించారు. ఒకపక్క కరోనా బారినపడి పేద మధ్యతరగతి ప్రజలు ఆర్ధికంగా చితికిపోయి బ్రతుకులను భారంగా ఈడుస్తుంటే ప్రజలను రక్షించి ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని విమర్శించారు. ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా తెలంగాణా ప్రభుత్వం కెసిఆర్ కూడా కరెంట్ చార్జిలను, RTC టిక్కెట్ రెట్లను పెంచి మోడీకి మించినవాడుగా తయారయ్యాడని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లాసమితి సభ్యులు ప్రకాశరావు, సిపిఐ మండల సహాయకార్యదర్శి చావా మురళి, ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి చెరుకూరి వెంకటేశ్వరరావు, సిపిఐ మండల నాయకులు రంగు నాగకృష్ణ, సిరివేరు శ్రీను, aisf జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, ఆటో యూనియన్ నాయకులు అక్కులు మొదలగు వారు పాల్గొన్నారు.