చొప్పకట్లపాలెం ప్రాథమిక పాఠశాలను సందర్శించిన సీఎంఓ, నోడల్ అధికారి

Published: Monday January 23, 2023
బోనకల్ జనవరి 21 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని చొప్పకట్లపాలెం ప్రాథమిక పాఠశాలలో
తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో
సీఎంఓ రాజశేఖర్ , మండల నోడల్ అధికారి చలపతిరావు చొప్పకట్ల పాలెం ప్రాథమిక పాఠశాలలో 
శనివారం సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా
భాగంగా సీఎం ఓ రాజశేఖర్ పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా సీఎం ఓ మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతిని
 విద్యార్థుల తండ్రి తల్లిదండ్రులకు పలు సూచనలు
చేయడం జరిగింది. గ్రామ పెద్దలు ఎడునూతల 
 రామకోటేశ్వర రావు దంపతులు తరగతిలో ప్రతిభ
కనబరచిన విద్యార్థులకు బహుమతులు నగదు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బ్బారావు , పాఠశాల ఎస్ఎంసి వైస్ చైర్మన్ కవిత ఎంపీటీసీ రాజ్యలక్ష్మి , ప్రధానోపాధ్యాయులు
ఎం కృష్ణ ప్రసాద్ , ఉపాధ్యాయురాలు డి.అనిత,
 విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.