ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన కేసీఆర్

Published: Saturday December 24, 2022
పట్లూరు సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 23 డిసెంబర్ ప్రజాపాలన : ఆకలికేకల తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పట్లూరు గ్రామ సర్పంచ్ దేవర దేశి అశోక్ అన్నారు. శుక్రవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ కరెంట్ సరఫరా చేస్తున్న ఘనత బిఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని కొనియాడారు. లాగోడు పెట్టుబడికి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతు బాంధవుడుగా ఆదుకుంటున్నాడని స్పష్టం చేశారు. రైతు చనిపోతే అతని కుటుంబం రోడ్డు పాలు కాకుండా ఉండేందుకు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టి సశ్యామలంగా మార్చారన్నారు. మిషన్ కాకతీయ తో నేడు గంగమ్మ తల్లి పొంగుతున్నదని వివరించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి నీటి కటకటను రూపుమాపారు అన్నారు. తాగునీటి కోసం మహిళలు బావుల దగ్గర బోర్ల దగ్గర కొట్లాడుకునే వారని గుర్తు చేశారు. మిషన్ భగీరథ తో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీరు రావడంతో తాగునీటి సమస్య తీరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ అంజాత్, బాలేష్ సునీల్ ప్రభు, తెరాస పార్టీ అధ్యక్షులు జి. అశోక్ రైతులు శ్రీశైలం, డైరెక్టర్ సంగన్న, రైతులు, యువకులు తలారి రమేష్, ఏముల అరుణ్ పాల్గొన్నారు.