దళితుల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యం

Published: Thursday December 16, 2021

మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి

జగిత్యాల, డిసెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : దళితులు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమని, ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని పార్లమెంట్ తేల్చిచెప్పింది అన్నదమ్ముల్ల కలిసి ఉంటేనే రాజ్యాధికారం సాధిస్తారని కొంతమంది అగ్రవర్ణాలు జీర్ణించుకోలేక కుట్రలు చేస్తున్నారు అని తెలంగాణ మాల మహానాడు జగిత్యాల జిల్లా అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అన్నారు. బుధవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో శ్రీహరి మాట్లాడుతూ గతంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ కు మద్దతు ఇచ్చిన ఆడిసాద్యం కాకపోయినా ఇదే మాదిగ సోదరులకు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించడం హాస్యాస్పదం అన్నారు. అనంతరం జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లో నూతన నియామకాలను చేపట్టారు గ్రామ సర్పంచ్ చెరుకు జాన్ ఆధ్వర్యంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు సండ్రపు విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులుగా అరికేల జగన్, మండల ప్రధాన కార్యదర్శిగా మేసు వెంకటేష్, ఉపాధ్యక్షులుగా నక్క శేఖర్, మండల యువజన ప్రధాన కార్యదర్శిగా నక్క శ్రీకాంత్, గ్రామ అధ్యక్షులుగా లక్కమ్ అక్షయ్ లను నియమించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరాల మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్రా రాజు, జిల్లా ఉపాధ్యక్షులు కల్లు అరుణ్ కుమార్, యువజన ప్రధాన కార్యదర్శి కీర్తి కుమార్, నియోజక వర్గ అధ్యక్షులు కోడిపెళ్లి సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు అరికేల జగన్, జగిత్యాల రూరల్ మండలం అధ్యక్షులు కొండ రాకేష్, జక్కుల అరుణ్ తదితరులు పాల్గొన్నారు.