బెల్టు షాపులకు మద్యం సప్లై చేస్తే సంబంధిత వైన్ షాపులు పై చర్యలు తప్పవు

Published: Wednesday June 09, 2021

మధిర ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా దాడులు.
మధిర, జూన్ 8, ప్రజాపాలన ప్రతినిధి : 26 కేసులు నమోదు, 563 మద్యం బాటిళ్లు స్వాధీనఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు. మధిర ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం షాపుల వారు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తే అట్టి షాపుల పై  చర్యలు తీసుకోవడం జరుగుతుందని మధిర ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు ఒక ప్రకటన లో పేర్కొన్నారు. గడిచిన నెల కాలంలో ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా దాడులు నిర్వహించి 26 మంది వ్యక్తుల పై కేసు నమోదు చేసి 563 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. 25 మందిపై కేసు నమోదు చేసినట్లు చూపించారు. కరోనా కట్టడికి బెల్ట్ షాపులు బంద్ చేయాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. నిబద్ధతతో పని చేస్తున్న ఎక్సైజ్ శాఖ పై కొందరు ఆరోపణలు చేయడం సరైనది కాదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని తెలిపారు.