దేవి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు పూజలు అందుకుంటున్న బాలాజీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ద

Published: Tuesday September 27, 2022
మధిర సెప్టెంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి మండల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు దేవీ నవరాత్రుల సందర్భంగా పలు గ్రామాల్లో దేవీ నవరాత్రులు ఉత్సవాలు ఆ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లోబ్రాహ్మణ బజార్లోని  దసరా నవరాత్రులలో భాగంగా కరుణ హృదయిని, లోకకళ్యాణకారిణి, అఖండ శక్తిస్వరూపిణియైన అమ్మవారు స్వర్ణాలనుకృత *దుర్గాదేవి అవతారంలో* భక్తులకు దర్శనమిస్తున్నది.ఈ దసరా నవరాత్రులలో పాల్గొని అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రులు కావలసిందిగా *శ్రీ భట్ల పెనుమర్తి రాజేశ్వర శర్మజాతక, వాస్తు సిద్ధాంతి భక్తులకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅదేవిధంగా శర్మ  శ్రీ దుర్గా దేవి అలంకారం విశిష్టతను  తెలియజేస్తూదుర్గతులను నాశనం చేసే రూపమే శ్రీ దుర్గా దేవి అలంకారం. ఈ రోజు అమ్మవారు *దుర్గముడు* అనే రాక్షసున్ని సంహరించింది. కనుక దేవిని ‘దుర్గ’ అని కూడా పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తారాలు,  శ్రీ లలిత సహస్రనామాలుతో పూజిస్తారని, ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎరుపు రంగు పుష్పాలతో అమ్మను పూజించాలిని తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందర దేవి అలంకారం భక్తులందరికీ తెలియజేయునది ఏమనగా దసరా సందర్భంగా దశావతారం సింహద్వారం నుండి ప్రవేశించి అమ్మవారిని దర్శించు కొన వలసిందిగా కోరుచున్నాము . పూజ అనంతరం భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ బాలత్రిపుర సుందర దేవి అమ్మవారు ఈ శరన్నవరాత్రి సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు కపిలవాయి జగన్మోహన్రావు ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు పూజా కార్యక్రమాలు చేయించుకునే భక్తులు శ్రీమాన్ శేషాచార్యులు  ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించదరు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము.