సీపీఐ నాయకుల అక్రమ అరెస్ట్ లు ఖండించండి

Published: Wednesday July 28, 2021
పేదలకు న్యాయం చేయమని అడిగితే అక్రమ అరెస్టులు చెయ్యడం ఏంటి
బోనకల్, జులై 27, ప్రజాపాలన ప్రతినిధి : కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గత 7 దశబ్దాలు గా నివాసం ఉంటున్న పేదల ఇండ్లను బలవంతంగా కూల్చివేతను నిరసిస్తూ అడ్డుకున్న CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. CPI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా ల అక్రమ అరెస్ట్ లను నిరసిస్తూ కలకోటలో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ బోనకల్ మండల కార్యదర్శి యంగల ఆనందరావు గత 70 సంవత్సరాలు గా పేదలు అక్కడ నివాసిస్తున్నారని, ఇప్పుడు కొత్తగా సత్తుపల్లి కో రైల్ మార్గాన్ని నిర్మించడానికి పేదలకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా, పునరనివాసం ఏర్పాటు చెయ్యకుండా తరలించే విధానాన్ని అడ్డుకుంటే అర్ధరాత్రి అక్రమంగా అరెస్టుల చేస్తారా ! అని ఆయన ప్రశ్నించారు. ఈ అక్రమ అరెస్టులను పార్టీలకు అతీతంగా ప్రజలు ఖండించాలని ఆయన కోరారు. పేదలపట్ల రైల్వే శాఖ కక్షపూరితంగా వ్యవహరిస్తోంద అన్నారు. రైల్వే శాఖకు వినియోగంలోలేని స్థలాల్లో పేదలు ఇండ్లు నిర్మించుకొని ఏడు దశాబ్దాలుగా నివసిస్తున్నారని, అర్ధాంతరంగా ఇండ్లను తొలగించి స్థలాలను స్వాదీనం జీవించే హక్కుని కలరాసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. పేదల ఇండ్ల విషయంలో కొందరు ద్వంద విధానాలు అవలంబిస్తున్నారని, ఇలాంటి విధానాలను మానుకొని పేదలకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలన్నారు. పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎలాంటి నిర్భందాలనైనా ప్రతిఘటించి ఇండ్లను కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, మండల నాయకులు ఏలూరి పూర్ణ చందర్రావు, తోటపల్లి ఆనందరావు, వల్లేబోయిన వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.