*విద్యుత్ ఎ సి డి బిల్లులను వెంటనే రద్దు చేయాలి*

Published: Wednesday February 01, 2023

మంచిర్యాల టౌన్, జనవరి 31, ప్రజాపాలన:తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ శాఖ వారు వినియోగదారులపై ఆదనపు వినియోగ  డిపాజిట్ ఎ సి డి  పేరుతో అక్రమంగా ఆదనపు వసూలు విరమించుకోవాలని బెల్లంపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టీ మణి రామ్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎ సి డి పేరుతో పేద మధ్యతరగతి ప్రజలపై వేలకోట్ల రూపాయలు దోసుకోవడం దుర్మార్గమని అన్నారు. రైతాంగానికి 24 గంట లు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, వెంటనే వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంటు ఇవ్వాలని అప్రకటిత కరెంటు కోతలు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని యెడల ప్రజలు కార్మికులు కర్షకులు ఎటువంటి పోరాటనికైన సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బొల్లు మల్లయ్య హరి కిషన్ పాండే దుగుట రవి గోగర్ల రాజశేఖర్ జి సదానందం సిహెచ్ రమేష్ జె కర్ణాకర్ ఏ తిరుపతి గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.