అభివృద్ధి పథంలో వెంకటాపూర్ తండా

Published: Wednesday July 14, 2021
53 లక్షల నిధులతో సిసి, బిటి రోడ్లు
కౌన్సిలర్ గా గెలిచిన తొలి దఫాలోనే అభివృద్ధి పనులు
ఆరవ వార్డు కౌన్సిలర్ రత్లావత్ చందర్ నాయక్
వికారాబాద్ జూలై 13 ప్రజాపాలన బ్యూరో : తాను గెలిచిన వార్డును ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాలనే సంకల్పం బలం ఉండాలి. అందుకు తగ్గట్టుగా సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగాలి. అధికారుల, రాజకీయ అధినాయకత్వం అండదండలు  కూడా పుష్కళంగా తోడవ్వాలి. కౌన్సిలర్ గా గెలిస్తే వార్డును అభివృద్ధి చేస్తాననే హామీని నెరవేర్చగలడు. అలుపెరుగని కృషితో అధికారుల, రాజకీయ అధినాయకత్వ మెప్పును పొంది వార్డు అభివృద్ధికి నిధులు రాబట్టుకోగలడు. ఆ కోవలోని వ్యక్తే వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ తండాకు చెందిన 6వ వార్డు కౌన్సిలర్ రత్లావత్ చందర్ నాయక్. మంగళవారం మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ నాగేందర్ రెడ్డి, కౌన్సిలర్ రత్లావత్ చందర్ నాయక్, రవినాయక్ ల సమక్షంలో సిసి రోడ్డు నిర్మాణానికి కొలతలను తీసుకున్నారు.
53 లక్షలతో సిసి, బిటి రోడ్ల నిర్మాణం : 14వ ఆర్థిక నిధులు :
10 లక్షల నిధులతో జగదాంబ దేవాలయం నుండి కల్వర్టు వరకు 120మీ. పొడవు 18ఫీట్ల వెడల్పు గల సిసి రోడ్డు నిర్మాణపు పనులు చేపట్టనున్నారు. 5లక్షల నిధులతో ఎన్నేపల్లిలో హైదరాబాద్ మేయిన్ రోడ్డు నుండి హాషం ఇంటి వరకు, టేలర్ ఇంటి నుండి సలీమ్ ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. 10లక్షల నిధులతో విశ్రాంత ఎంఆర్ఓ ఇంటి నుండి విజయ్ ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం పనులు పూర్తయ్యాయి. 12 లక్షల నిధులతో విశ్రాంత ఎంఆర్ఓ ఇంటి నుండి పెద్దమ్మ గుడి వరకు బిటి రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. 5 లక్షల నిధులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి రాములు ఇంటి వరకు, 5 లక్షల నిధులతో మైనారిటీ స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు.
నాలుగు తండాలకు ఒకే స్మశాన వాటిక నిర్మాణం :
సర్వే నంబర్ 92లో గల 30 గుంటల ప్రభుత్వ భూమిని కలెక్టర్ ఆదేశానుసారం ఎంఆర్ఓ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మాణం చేసి వైకుంఠధామం నిర్మాణానికి స్థలం కేటాయించారు. 
త్వరలో కల్వర్టు నిర్మాణం :
6 లక్షల 14వ ఆర్థిక నిధులతో కల్వర్టు నిర్మాణపు పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తం 53 లక్షల నిధులతో వెంకటాపూర్ తండా, ఎన్నేపల్లిలో అభివృద్ధి పనులు చేపట్టామని కౌన్సిలర్ రత్లావత్ చందర్ నాయక్ వివరించారు.