కార్మిక పక్షపాతి సీఎం కెసిఆర్ * వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Saturday August 06, 2022
వికారాబాద్ బ్యూరో 05 ఆగస్టు ప్రజా పాలన : విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టిఆర్ వికేఎస్ అధ్యక్షుడు జాన్సన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాష్ రాష్ట్ర అదనపు కార్యదర్శి నిరంజన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ గౌడ్ కరణ్ రావు జిల్లా టిఆర్ వీకేఎస్ అధ్యక్షుడు రఘునందన్ గౌడ్ జిల్లా టి ఆర్ వికెఎస్ కార్యదర్శి ధన్నారం రుక్మయ్య హరి ప్రసాద్ గౌడ్ పి రాములు హాజరయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమం కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. విద్యుత్ కార్మికుల సమస్యలు ఏవి ఉన్నా వెంటనే సానుకూల దృక్పథంతో ఆలోచించి పరిష్కరించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు విద్యుత్ సమస్యలు రానీయకుండా అవ్రిశాంత అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కార్మికులను అభినందిస్తున్నానని తెలిపారు.
అనంతరం క్లబ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సమక్షంలో ఇతర యూనియన్ లకు చెందిన పలువురు కార్మిక నాయకులు టి ఆర్ వికేఎస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ మురళి కృష్ణ గౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యుత్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.