4న హైదరాబాదులో జరిగే ధర్నాను జయప్రదం చేయండి

Published: Saturday July 02, 2022
ఐద్వా మధిర  పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి. మధిర జూలై 1 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు చలో హైదరాబాద్ ఈనెల 4వ తారీఖు జరిగే ధర్నాకుఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో వెలుగులోకి వచ్చిన సమస్యల పరిష్కారానికి జులై 4వ తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ధర్నాలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఐద్వా మధిర పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి కోరారు. గురువారం  ఐద్వా మధిర  పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మధిర  మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించి వార్డు  నందు సమస్యలపైన ఇంటింటి సర్వే నిర్వహించి, సంతకాలు సేకరణ చేశారు, "ఈ సేకరించిన పత్రాలను ఐద్వా ద్వారా రాష్ట్రపతికి పంపిస్తామని" ఆమె తెలిపినారు.. ఈ సందర్భంగా ఐద్వా మధిర పట్టణ కార్యదర్శి మండవ ఫణింద్ర కుమారి మాట్లాడుతూ అర్హులందరికీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళు, రేషన్ కార్డులు,ఒంటరి మహిళల, వృద్ధాప్యం, వితంతువు, ఫించన్లు ఇవ్వాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల సరుకులను ఇవ్వాలని, అభయ హస్తం నిధులను వెంటనే విడుదల చేయాలని,  రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి తదితర సమస్యల పరిష్కారానికి ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరాటాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఐద్వా కమిటీ సభ్యులు   మధిర ఐద్వా  అధ్యక్షురాలు  sk.ఫాతిమాబేగం,వెంకట్రావమ్మ,పద్మ  తదితరులు పాల్గొన్నారు.