తెలంగాణ ఈజిఎస్ ఇంజనీర్ల డైరీ ఆవిష్కరణ చేసిన పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

Published: Thursday February 03, 2022
హైదరాబాద్ 2 ఫిబ్రవరి ప్రజాపాలన: తెలంగాణ ఉపాధి హామీ పథకం (ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్కీం) ఈజీఎస్ ఇంజనీర్ల సంఘం డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరించిన పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 17వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఈజీఎస్ ఇంజనీర్ల సంఘం డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఈజీఎస్ ఇంజనీర్ల సంఘం డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈజిఎస్ ఇంజనీర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.ఉదయ్ కుమార్ తో పాటు ఇ.సి. తదితరులు  పాల్గొన్నారు.