ఐటిఐ కళాశాల ఆవరణంలో నేడు జాబ్ మేళా

Published: Thursday March 18, 2021
-ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు
మంచిర్యాల టౌన్, మార్చి17, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా లోని నిరుద్యోగ యువతి యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెవ18 గురువారం రోజున మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ  ఐటిఐ కళాశాల ఆవరణంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించబడును కావున అభ్యర్థులు ఇట్టి అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు ఈ జాబ్ మేళాలో హైదరాబాద్ లోని పేటీఎం, స్వర్ణముఖి హౌసింగ్ ప్రవేట్ లిమిటెడ్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ప్రీమియర్ హెల్త్ సర్వీస్, కార్టూన్ బి పి ఓ, మరియు మంచిర్యాల్ లోని శ్రీ వెంకటేశ్వర షాపింగ్ మాల్, పలు ప్రైవేట్ కంపెనీలలో ఫీల్డ్ ఆఫీసర్, టెలీకాలర్స్, టీమ్ లీడర్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, డ్రైవర్, ఫ్లోర్ ఇంచార్జ్, సేల్స్ గర్ల్స్, సేల్స్ మెన్, డెవలప్మెంట్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, జి ఎన్ ఎం, నర్స్, ఉద్యోగాల కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ, నర్సింగ్ ఆపై అర్హతలు ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ వెంట బయోడేటా ఫామ్ తో విద్యార్హతల నిజ ధ్రువీకరణ కాఫీలు ఫోటో, ఆధార్ కార్డు, మరియు నకలు ధ్రువీకరణ కాపీలు, తీసుకొని జాబ్ మేళ కు హాజరు కావాలని చూపించారు ఇతర వివరాలకు 9676032186 చరవాణిలో సంప్రదించవలసినదిగా తెలిపారు