ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి *పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఐ డిమా

Published: Tuesday February 21, 2023

ప్రభుత్వ భూముల్లో పేదలకు  ఇళ్ల స్థలాల  పట్టాలు ఇవ్వాలని, వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ సమితి  ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం (ఆర్ డి ఓ) కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పి. శివకుమార్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా పేదలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇండ్ల స్థలాల పట్టాలు ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తామని, రాజ్యాంగం కల్పించిన నివసించే హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలా   రాస్తుందని సిపిఐ నాయకులు రాష్ట్ర ప్రభుత్వన్ని దుయబట్టారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర సమితి సభ్యులు ఓరుగంటి యాదయ్య, పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ పేదలందరికీ  ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలు 60 గజాల జాగా  కోసం గుడిసెలు వేస్తే పీకేస్తున్న ప్రభుత్వం నాయకులపై  అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమ్ముకుంటుంటే. పాలకులు కబ్జాదారులకు మద్దతు ఇస్తూ పేదలను వంచిస్తుందని అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలని అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా  చీమకుట్టినట్టు కూడా స్పందన లేదని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం పేదల సమస్యలను పరిష్కరించకుండా భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తుందని అన్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్థలాలు ఇస్తామని మాటలు చెప్పడం తప్ప చేతలు లేవని అన్నారు.  రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మారుస్తుంటే ప్రభుత్వం చోద్యం చేస్తూ అక్రమార్కులకు, భూ కబ్జాదారులకు కాపలాకాస్తుందని అన్నారు. పేదలకు చెందవలసిన ప్రభుత్వములలో రాష్ట్ర ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని డబ్బున్న వారికి భూములను కట్టబెడుతూ.. పేదలను విస్మరిస్తుందనిఅన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం.. ప్రభుత్వ భూములను కాపాడి పేదలకు ఇళ్ల స్థలాలు పంచకపోతే ప్రభుత్వ భూముల్లో పేదలందరు గుడిసెలు వేస్తారని వారికి ఎర్రజెండా అండగా నిలబడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇందుతో పార్టీ జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య గారు మాట్లాడుతున్న ఫోటోను మరియు కార్యక్రమం యొక్క ఫోటోలు జత చేయడం జరిగింది.