మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే 20

Published: Wednesday May 19, 2021
ప్రిన్సిపాల్ మొహ్మద్ అలీముద్దీన్
మల్లాపూర్, మే 18 (ప్రజాపాలన ప్రతినిధి): మల్లాపూర్ మండలకేంద్రంలో తెలంగాణ ఆదర్శ పాఠశాల- మల్లాపూర్ యందు ప్రవేశపరిక్షలకోసం ఆశక్తిగల విద్యార్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6వ తరగతిలో మొత్తం 100 సీట్ల కొరకు మరియు 8వ, 9వ, 10వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల కొరకు చివరి అవకాశంగా ఈ నెల అనగా మే 20వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ మొహమ్మద్ అలీముద్దీన్ పత్రిక ప్రకనలో తెలిపారు.