బిఆర్ఎస్ పార్టీలో యువతకు పెద్దపీట ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

Published: Wednesday October 26, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కేంద్రంలో స్థానిక మార్కెట్ యార్డ్ లో జరిగిన  మండల యూత్ కమిటీ సమావేశం లో  రాజకీయాల్లో , ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకులు కీలకపాత్ర పోషించాలని మణుగూరు మండల బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, భూర్గంపహాడ్ మండల ఇంచార్జ్ హర్షనాయుడు అన్నారు... బిఆర్‌ఎస్‌ పార్టీ బూర్గంపహాడ్ మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని అద్యక్షతన బూర్గంపహడ్ కేంద్ర మార్కెట్ యార్డు లో జరిగిన మండల యూత్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్ రోజుల్లో రాజకీయాల్లో యువకులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు  పినపాక నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్దిని అందరికి తెలిసేలా  గ్రామాల్లో యువత భాధ్యత తీసుకోవాలన్నారు.  అదేవిధంగా గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలనన్నారు. ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులను కలుపుకొని రాజకీయాలు చేయాలన్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయన్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తుందన్నారు. పినపాక నియోజకవర్గం అభివృద్ది కేవలం ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యమన్నారు. రేపటి నుంచి బూర్గంపాడు మండలంలోని 17 పంచాయతీలు తిరిగి గ్రామంలోని యూత్ కమిటీలు వేయడం జరుగుతుందని అన్నారు. దీనికి మండలంలోని మండల స్థాయి యూత్ కమిటీ సభ్యులందరు సహకరించాలని కోరారు...
ఈ సమావేశంలోమండల అధ్యక్షుడు గొనెల నాని, సెక్రటరీ యారం సుధాకర్ రెడ్డి, మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ జై చంద్ర,సారపాక యూత్ అధ్యక్షులు సోము.లక్ష్మీ చైతన్య రెడ్డి, సారపాక యూత్ జనరల్ సెక్రటరీ చిరంజీవి, వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, మండల యూత్ నాయకులు తొకల సతీష్, గంగ రాజు, కోట రమేష్, కేసూపాక మహేష్, మందా ప్రసాద్, కన్నేపల్లి సతీష్, బర్ల ప్రవీణ్, సుధాకర్,పవన్, రాయల నరేంద్ర, గొడ్ల రాజూ, రాకేష్ , కుమ్మరిపల్లి నాగరాజు, శాన్కురి సతీష్,గుండె సతీష్, డేగలనవీన్, తోకల శివ, బొగ్గుల ప్రసాద్,బాసిపోయిన కిట్టు, ప్రవీణ్,ప్రసాద్, మండలంలోని యువత తదితరులు పాల్గొన్నారు...    యువత  పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.