బాబుజగ్జీవన్ రావు సేవలు మరువలేనివి

Published: Tuesday April 06, 2021
ఏప్రిల్ 5, ప్రజాపాలన ప్రతినిధి : ఎంపీపీ మెండెం లలిత ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని మహోన్నతమై వ్యక్తి అదే కాకుండా అయినా ఆయన అడుగుజాడల్లో మనమందరం ఆదర్శంగా ఉండాలని అదేవిధంగా మాజీ ఉప ప్రధాని స్వతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రావ్ సేవలు మరువలేనివని మధిర మండల పరిషత్ అధ్యక్షురాలు మెండెం లలిత పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మెండెం వెంకయ్య మండల పరిషత్తు సిబ్బంది పాల్గొన్నారు.