ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నాయక్ మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన ఎస్టీ మోర్చా రాష్ట

Published: Wednesday February 22, 2023
బోనకల్, ఫిబ్రవరి 21 ప్రజా పాలన ప్రతినిధి: మహబూబాద్ కిరికిరి ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన బిఆర్ఎస్ గుండాలను రౌడీ మూకలను సోమవారం నెల్లికుదురు మండలం లోని నైనాల గ్రామంలో ప్రజాస్వామ్య బద్దంగా బిజెపి మీటింగ్ నిర్వహిస్తున్న ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ మీద దాడి చేయడం అత్యంత దిక్కుమాలిన చర్య, సిగ్గులేని తనం అని ఎస్టి మోర్చా రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ బీపీ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలల్లో బిజెపి కి వస్తున్న ఆదరణను ఓర్వలేక, హుస్సేన్ నాయక్ మీద చూపిస్తున్న మహబూబాబాద్ ప్రజల ప్రేమాభిమానాన్ని చూసి సహించలేక శంకర్ నాయక్ ఇలా భౌతిక దాడులకు, హత్యలకు ప్రేరేపించే విధంగా పూనుకోవడం అత్యంత హేమమైన చర్య అని, ఆయన రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు.ఇదంతా కళ్ళ ముందు జరుగుతున్న కూడా చోద్యం చూస్తున్న పోలీస్ అధికారులు, ఖాకి యూనిఫామ్ వేసుకున్నారా లేకపోతే గులాబీ కండువా తప్పుకొని గులాం గిరి చేస్తున్నారా అని ప్రశ్నించారు.
శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీస్ అధికారులు ఇలా ఎమ్మెల్యే చేస్తున్న దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు వత్తాసు పలకడం వారి చేతగాని తనానికి పరాకాష్ట అని ఇలాంటి పోలీస్ అధికారులను చూస్తే వారి ఇంట్లో ఆడవాళ్లు గాని వారి కన్నా కొడుకులు కూతుర్లు కూడా గౌరవించలేని బతుకు బతుకుతున్న పోలీసు అధికారులు పద్ధతి మార్చుకోవాలని హితువు పలికారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాబోతుందనీ, ఈ విషయం ప్రతి ఒక్క పోలీస్ అధికారి గుర్తుంచుకోవాలనీ అధికార పార్టీ నాయకులకు, రౌడీ ఎమ్మెల్యేలకు తలొగ్గి భారతీయ జనతా పార్టీ నాయకుల,కార్యకర్తల దాడి చేస్తున్న పోలీసువారి లిస్టు తయారు చేస్తున్నామని, అలాంటివారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చించారు. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ పతనం మొదలైందనీ, ప్రజలే అతనికి తగిన బుద్ధి చెబుతారనీ మహబూబాద్ నుండి బహిష్కరించే రోజు అతి దగ్గరలోనే ఉందని మండిపడ్డారు.రాష్ట్ర గిరిజన నాయకుడు పైన జరిగిన దాడిని అధికార పార్టీ బాధ్యత వహించాలని, శంకర్ నాయక్ పైన చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్రమంతటా నిరసనలు, ఆందోళనలు చేస్తామని ధ్వజమెత్తారు.