ఘనంగా కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు

Published: Tuesday May 11, 2021
మేడిపల్లి, మే10 (ప్రజాపాలన ప్రతినిధి) : చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ కు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, గరిక సుధాకర్, లింగ నాయక్, జగన్, పుష్ప రాజు, శ్రీకాంత్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.