నియోజవర్గంలో పొంగులేటికి తరగని ప్రజా దరణ పొంగులేటి కి జన్మదిన వేడుకలు సందర్భంగా

Published: Saturday October 29, 2022

ప్రజలు బ్రహ్మరథం మధిర అక్టోబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో నియోజవర్గ ప్రజలు పొంగులేటికి తరగని ప్రజా పొంగులేటి కి జన్మదిన వేడుక సందర్భంగా ప్రజల నుండి బ్రహ్మరథం పట్టారు అనంతరం ఘనంగా నిర్వహించిన పొంగులేటి జన్మదిన వేడుకలుమధిరలో పొంగులేటికి తరగని ప్రజాదరణజన్మదిన వేడుకల్లో భారీ బైక్ ర్యాలీతో పాల్గొన్న అభిమానులు మధిర నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకల్లో మరోసారి పొంగులేటి పట్ల ప్రజల్లో చెక్కు చెదరని అభిమానం స్పష్టంగా కనిపించింది. ఈ వేడుకలను చూసి ఆయనను ప్రజల మనిషిగా చెప్పుకుంటూ టిఆర్ఎస్ క్యాడర్ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఆంధ్ర సరిహద్దులో ఉన్న మధిర నియోజకవర్గంలో గులాబీ పార్టీని  బలోపేతం చేయడంలో పొంగులేటి పాత్ర మరువలేనిది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై టిఆర్ఎస్ పార్టీలో చేరి ఆపార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పని చేశారు.  పొంగులేటి  నిత్యం జిల్లాలో జరిగే  అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శుభకార్యాల్లో, ప్రమాదాల్లో  గాయపడినవారిని, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను,  పరామర్శిస్తూ బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేస్తుండేవారు. ఆపదలో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్న వారు సాయం అడిగితే లేదు, కాదు, అని చెప్పడం ఆయన డిక్షనరీలో లేదు. పొంగులేటి పదవిలో ఉన్నా, లేకపోయినా, ఆయన ప్రజల మధ్య తిరుగుతూ  ప్రజల మనిషిగా చెప్పుకుంటూ  ఆయన అభిమానులు జన్మదిన వేడుకలను  ఘనంగా నిర్వహించుకోవడం విశేషం. జిల్లాలో మారిన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎటువంటి రాజకీయ బాధ్యతలు లేనప్పటికీ పొంగులేటిపై మధిర ప్రాంత ప్రజల్లో కులమాతాలకతీతంగా టిఆర్ఎస్ పార్టీ కేడర్లో ఉన్న ప్రజాదరణ పొంగులేటి జన్మదిన వేడుకల్లో ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. ప్రజా ప్రతినిధిగా రాజకీయ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజానీకంతో పొంగులేటి ఏర్పరుచుకున్న రాజకీయ, వ్యక్తిగత సంబంధాలు, ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులు వ్యక్తిగత సహాయాలు పొంగులేటిని జననేతగా, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా విలక్షణ రాజకీయ నేతగా నిలబెట్టాయి. పార్టీలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా నేనున్నా అనే భరోసాని కల్పించడంలో ఆయన ముందుండేవారు. మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పొంగులేటి శీనన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా మధిర పట్టణంలో భారీ ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి తమ అభిమాన నాయకుడి పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పుట్టినరోజు సంబరాలు ఒక పండుగ మాదిరిగా జరుపుకోవడం విశేషం. ఎప్పటికైనా తాను నమ్ముకున్న పార్టీ తనకు అన్యాయం చేయదని ఉద్దేశంతో పార్టీ ఏది చెబితే ఆ పనిని సమర్ధవంతంగా నిర్వహిస్తూ పార్టీ అధిష్టానం దృష్టిలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. అయితే రాజకీయ సామాజిక కారణాల నేపథ్యంలో ఆయనకు తాత్కాలికంగా ఏ పదవి దక్కలేదు. భవిష్యత్తులో ఆయనకు మంచి పదవి బాధ్యతలు అప్పగించి సముచిత స్థానం కల్పించి ఆయన సేవలను టిఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా వినియోగించుకుంటున్నారని ఆ పార్టీలో చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పురపాలక శాఖ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం పొంగులేటి కృషి చేశారు. ఏపదవి లేకపోయినా పని చేస్తూ అటు పార్టీ కేడర్లో పొంగులేటి అభిమానుల్లో ఆయన  ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నారు.