రాయికల్ మున్సిపల్ కార్యాలయ సమీక్షా సమావేశం

Published: Wednesday June 29, 2022
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ 
 
 
 రాయికల్, జూన్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): పురపాలక సంఘ రాయికల్ కార్యాలయమునందు జగిత్యాల జిల్లాఅదనపు కలెక్టర్ (స్థానికసంస్థల) వినోద్ కుమార్ రాయికల్ పురపాలక కమీషనర్ తో కలిసి కార్యాలయ సిబ్బందితో రివ్యూ (సమీక్షా) సమావేశము నిర్వహించినారు. ఈ సమావేశములో పట్టణములో టి.యు. ఎఫ్.ఐ.డి.సి నిధులతో పట్టణ ప్రగతిలో చేపట్టిన పలుఅభివృద్ధి పనులపై సంబంధిత శాఖల ఏ.ఈ. లతో, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు . ఇందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాల పనితీరు గురించి,పట్టణ ప్రగతి కార్యక్రమములో చేపట్టిన పనులను గురించిఅధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పట్టణములోని అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే గుర్తించి నిలువరించాలని నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. అనంతరం పట్టణపెద్దచెరువుదగ్గర ఏర్పాటుచేస్తున్న మినీ ట్యాంకు బండ్ నిర్మాణ పనులను పరిశీలించినారు. ఈ కార్యక్రమములో జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ మునిసిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, మున్సిపల్ కమీషనర్ గంగుల సంతోష్ కుమార్,  ఏ.ఈలు, జూనియర్ అసిస్టెంట్ కె.గంగనర్సయ్య మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.