కంటి వెలుగు వైద్య శిబిరంను వినియోగించుకోవాలి -డాక్టర్ కిషోర్

Published: Thursday April 13, 2023
*కంటి వెలుగు వైద్య శిబిరంను వినియోగించుకోవాలి -డాక్టర్ కిషోర్*
 
 హైదరాబాద్ ఏప్రిల్ 12 ప్రజాపాలన: జనగాం జిల్లా తరిగొప్పుల మండలం 
హనుమంతపూర్ గ్రామ పంచాయతీ లో కంటి వెలుగు వైద్య శిబిరంను స్థానిక సర్పంచ్ పగడాల విజయ నర్సయ్య ఆద్వర్యంలో ప్రారంభించారు. ఈ నెల అంటే ఎప్రిల్ 12 వ తేదీ నుండి 24 వ తేదీ 
వరకు అన్ని పని దినాలలో  కంటి వెలుగు వైద్య శిబిరం పనిచేస్తుందని  స్థానిక వైద్యులు  డాక్టర్ కిషోర్ తాల్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని 
 ప్రజలందరు వినియోగించుకోవాలని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి   డాక్టర్ కిషోర్ తాల్క తెలియజేశారు.  
కంటి వెలుగు శిబిరం లో కంటి పరీక్షలు నిర్వహించిన పిదప ఉచితంగా  కళ్ల అద్దాలు , మందులు ఇస్తారు. దూరపు మరియు దగ్గర చూపు ఉన్న వారికి ప్రిస్క్రిప్షన్ ఆర్డర్ అద్దాలు, మందులు పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు.  ఈ కార్యక్రమం లో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు  టి.గోవర్ధన్ , గ్రామ సర్పంచ్ పగడాల విజయ నర్సయ్య , జడ్పీటిసి యం.శ్రీనివాస్  మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది తో కలిసి ప్రారంభించారు.  ఈ కంటి వెలుగు కార్యక్రమంను  ప్రజలందరు  వినియోగించుకొని వారి కంటి సమస్యలను నివారించుకోవాలని డాక్టర్ కిషోర్ తాల్క తెలిపారు.
 ఈ కార్యక్రమంలో 
 క్యాంపు టీం లీడర్ డాక్టర్. ఝాన్సీ ,ఆరోగ్య పర్యవేక్షణాధికారి భాగ్యమ్మ , ఆప్టోమెట్రిస్ట్ కరుణాకర్, డేటా ఆపరేటర్ ముజమ్మిల్,  ఎ.ఎన్. యం. సునంథ, లావణ్య, ఆశా వర్కర్లు  తదితరులు పాల్గొన్నారు.