ప్రతిభ చాటి.. ప్రత్యర్థులను మట్టి కురిపించి..

Published: Tuesday November 15, 2022
కరాటే సత్తా చాటిన కస్తూర్భ విద్యార్థినులు ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి నవంబర్ 14:
భాగ్యనగరంలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన  కరాటే బుడోకాన్‌ పోటీల్లో విద్యార్థినుల సత్తా చాటినట్లు మాస్టర్‌ కరీం తెలిపారు.  ఈ పోటీలకు శ్రీలంక, ఇరాన్, ఇరాఖ్, బంగ్లాదేశ్, ఉగాండా , నేపాల్‌ తదితర దేశాల నుంచి దాదాపుగా 3000 విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీలో కొడంగల్‌ పట్టణంలో కస్తూర్భగాంధీ పాఠశాలకు చెందిన విద్యార్థినులు ప్రత్యేర్థులను మట్టి కరిపించారు. డీ.అశ్విని ఎల్లో బెల్ట్‌ విభాగంలో స్పెరింగ్‌లో గోల్డ్‌ మెడల్,  
సంధ్యరాణి వైట్‌ అండ్‌ ఎల్లో బెల్ట్‌ కటాస్‌లో బీ–గ్రూప్‌లో గోల్డ్‌మెడల్,  ఈ. అశ్విని వైట్‌బెల్ట్‌ కటాస్‌లో గోల్డ్‌మెడల్, ఝాన్సీ బీ–గ్రూప్‌లో కటాస్‌లో గోల్డ్‌ మెడల్, కృష్ణవేణి బ్లూ బెల్ట్‌లో గోల్డ్‌మెడల్, గాయత్రి ఆరెంజ్‌ బెల్ట్‌లో సీ–గ్రూప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. నవీన ఆదర్శ పాఠశాలకు చెందిన కైఫోద్దీన్‌ వైట్‌బెల్ట్‌ విభాగంలో కటాస్‌లో గ్రూప్‌–సీలో సిల్వార్‌ బెల్ట్‌ సా«ధించి తమ ప్రతిభను కనబర్చినట్లు కరాటే మాస్టర్‌ ఎండీ. కరీం పేర్కొన్నారు. పతకాలతో పట్టణానికి చేరుకున్న విద్యార్థులను పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి ప్రిన్సిపల్స్‌ శ్రావంతి, నరేష్‌రాజ్, పట్టణవాసులు అభినందనలు తెలిపారు.