బిసిలకు రాజ్యాధికారంలో జనాభా ప్రాతిపదికన వాటా బి ఎస్ పి తోనే సాధ్యం

Published: Wednesday December 29, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 28 ప్రజాపాలన ప్రతినిధి : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా బహుజన ప్రజలైన బిసి, ఎస్సి, ఎస్టీ, మత మైనారిటీ ప్రజలు ఇంకా ఓట్లు వేసి యంత్రాలుగానే మిగిలిపోతున్నారు, ఓట్లు వేయించుకున్న వారు మాత్రం కోటాను కోట్లకి పడగలెత్తి, ఉచితంగా ఇవ్వాల్సిన విద్యా, వైద్యం ని ప్రవేటుపరం చేసి ఉన్న ఆస్తులను కూడా అమ్ముకుని అడుక్కుతినే పరిస్థితిని తీసుకొచ్చిన ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్దిచేప్పి బహుజన రాజ్యాన్ని తీసుకరావడానీకై ప్రతీ ఒక్కరూ బీఎస్పీ లో చేరాలని కోరుతున్నాం బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్ గారి ఆధ్వర్యంలో సమావేశ పరిచిన సమావేశానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, అసెంబ్లీ ఇంచార్జ్ పల్లాటి రాములు గారు హాజరైయ్యారు. ఈ సమావేశంలో. బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం ప్రధాన కార్యదర్శిగా బోళ్ల గణేష్ ముదిరాజ్గారిని, అసెంబ్లీ BVF కన్వీనర్ గా మంతపురం లోకేష్ గారిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ధార యాదగిరి గారు, కోశాధికారి కంబాలపల్లి శాంతగారు పాల్గొన్నారు.