కోరట్లగూడెం లో డెంగ్యూ కేసు నమోదు. గ్రామాన్ని సందర్శించిన అధికార యంత్రాంగం..

Published: Wednesday July 27, 2022
పాలేరు జూలై 26 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండలం లోని కోరట్లగూడెం గ్రామంలో డెంగ్యూ కేసు నమోదైంది. ఇటీవల ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓ వ్యక్తి కి డెంగ్యూ బారినపడ్డారు.
విషయం తెలుసుకున్న నేలకొండపల్లి ఎంపీడీఓ కె. జమలారెడ్డి, మండల పంచాయతీ అధికారి సి.హెచ్.శివ లు మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. బాధితుడు తో మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఆరోగ్యశాఖ అధికారులు అన్ని వీధుల్లో బ్లీచింగ్ చల్లించి. మురుగు కాల్వల్లో ఆయిల్ బాల్స్ ను వదిలారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 'సీజనల్ లో అప్రమతత అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్
బచ్చలకూరి జ్యోతి, కార్యదర్శి బుర్రా లింగరాజు, ఏఎన్ఎం. ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.