చేనేత హస్తకళలకు చేయూతనిచ్చి సాంప్రదాయాన్ని కాపాడుదాం

Published: Tuesday September 27, 2022
చేనేత హస్తకళల మేనేజర్ పవన్ కుమార్
వికారాబాద్ బ్యూరో 26 సెప్టెంబర్ ప్రజా పాలన : చేనేత హస్తకళలకు చేయూతనిచ్చి మన సాంప్రదాయాన్ని కాపాడుదామని చేనేత హస్తకళల మేనేజర్ పవన్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్లబ్బులో చేనేత హస్త కళ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాప్స్ షో రూమ్ ను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 40 డ్వాక్రా చేనేత హస్త కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారని వివరించారు. దసరా ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన సరసమైన ధరలకు అన్ని వస్తువులు లభించునని స్పష్టం చేశారు పోచంపల్లి నారాయణపేట్ ఉప్పాడ చీరాల మంగళగిరి కలంకారి ఫ్యాన్సీ ఖాదీ కాటన్ ప్రింటెడ్ బెంగాల్ సిల్క్ కాంత వర్క్ కాటన్ భాగల్పూర్ సిల్క్ చాందిని సిల్క్ గుజరాత్ డిజైన్ టాప్స్ లక్నో చికెన్ వర్క్ డోర్ కర్టెన్స్ డోర్ మాట్స్ వరంగల్ టవల్స్ బెడ్ షీట్స్ రాజస్థానీ ప్రింటెడ్ టాప్స్ జైపూర్ టాప్స్ జైపూర్ బెడ్ షీట్స్ ఖాదీ షర్ట్స్ ఒక గ్రాం గోల్డ్ సారంగాపూర్ ఫుడ్ ఐటమ్స్ తదితర వస్తువులు లభించునని చెప్పారు ఈ కార్యక్రమంలో చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాప్స్ యజమానులు పవన్ కుమార్ రాణి తదితర సిబ్బంది ఉన్నారు.