భార్య, భర్తలకు ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాలి. ఎస్. టి.యు

Published: Monday December 20, 2021

జగిత్యాల, డిసెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి): ఉపాధ్యాయులకు జిల్లాల కేటాయింపు ప్రక్రియలో సీనియర్లతో పాటు, జూనియర్ల స్థానికతకు భంగం కలగకుండా చూడాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్. టి .యు .టిఎస్. ప్రథమ కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ఆదివారం ఎస్టియు భవన్ లో జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భైరం హరికిరణ్, మచ్చ శంకర్ మాట్లాడుతూ  జీవో నెంబర్ 317 ప్రకారం కేవలం సీనియారిటీ పరిగణలోకి తీసుకోవడం వల్ల జిల్లా కేటాయింపుల్లో జూనియర్ ఉపాధ్యాయులు స్థానికత కోల్పోయి శాశ్వతంగా వేరే జిల్లాలకు కేటాయించడం అన్యాయం అని అన్నారు. స్థానికతకు ప్రాధాన్యం ఇచ్చి ఆర్టికల్ 371 డి ప్రకారం ఉపాధ్యాయ హక్కులను కాపాడాలన్నారు. శాశ్వత కేటాయింపుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తూ స్పోస్  కేటగిరి ద్వారా భార్యాభర్తలకు ఒకే చోట పోస్టంగ్ ఇవ్వాలని, ఉపాధ్యాయుల జిల్లాల  ఆప్షన్ ప్రాధాన్యతా  క్రమాన్ని బహిర్గతం చేయాలనీ, సవరణకు సైతం అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ జాబితాలో తప్పులను సవరించి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిబంధనలకు లోబడి  కేటాయింపులు జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్థిక  కార్యదర్శి మేకల ప్రవీణ్, జిల్లా, వివిధ మండల బాధ్యులు  పాల్గొన్నారు.