డెవలప్మెంట్ చార్జీల పేరుతో దోపిడీ

Published: Wednesday February 16, 2022
విద్యుత్ శాఖ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 22న కాంగ్రెస్ నిరసన
బెల్లంపల్లి, ఫిబ్రవరి 15, ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై అధికంగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తూ ఆగం చేస్తున్నారని బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కరెంటు బిల్లులపై డెవలప్మెంట్ చార్జీల పేరుతో పేదలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, విద్యుత్ శాఖ వారు అధిక చార్జీలు వసూలు చేయటం అన్యాయమని, ఈ నిర్ణయాలను  కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నా మని అన్నారు. పెంచిన అధిక చార్జీలకు నిరసనగా ఈ నెల 22న స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను మమేకం చేస్తూ ఆందోళన, ధర్నా, కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ అధికారులే వహించాల్సి ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు బిల్లులపై డెవలప్మెంట్ ఛార్జీలు అధికంగా వసూలు చేయడం అన్యాయమని, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన  అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మత్తమారి సూరిబాబు, (టి.పి.సి.సి కార్యదర్శి) మాజీ ఎమ్మెల్యే, అమ్రాజుల శ్రీదేవి, ముచ్చర్ల మల్లయ్య, గెళ్లి జయరాం, సిలీవెరీ సత్యనారాయణ, మేకల శ్రీనివాస్, రామగిరి శ్రీను, జంజిరాల రాజం, బర్రె మదునయ్య, లెంకల శ్రీనివాస్, సోదే వినేష్, పోచంపల్లి హరీష్, అంకం రవి, ఆడెపు మహేష్, సింగ్ ఆడే సాబ్, రాజా బ్రహ్మం, కుమ్మరి శంకర్, దేవసాని ఆనంద్, మెరుగు రామకృష్ణ, సోగల రవికుమార్, కాశిపాక రాజారత్నం, బబ్లు, తదితరులు పాల్గొన్నారు.