ఆరోగ్యవంతమైన జీవితానికి ఆక్సిజన్ ఎంతో అవసరం జిల్లా పరిషత్ సీఈవో అప్పారావు

Published: Wednesday November 23, 2022

బోనకల్, నవంబర్ 22, ప్రజా పాలన ప్రతినిధి: మానవ మనుగడకు మొక్కలే జీవనాధారం అని ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షిస్తే భావితరాలకు ఎంతగానో ఉపయోగపడతాయని జడ్పీ సీఈఓ అప్పారావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ముష్టికుంట్ల, చిరునోముల గ్రామాలలోని ఎన్ఎస్పి కాలువ అంచున హరితహారం లో భాగంగా వేసిన బండ్ ప్లాంటేషన్ ను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఆరోగ్యవంతమైన జీవితానికి ఆక్సిజన్ ఎంతో అవసరం అని చెట్ల వల్లనే మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తుందని అన్నారు.. పర్యావరణ పరిరక్షణకు హరితహారం ఎంతో ప్రాముఖ్యమైనదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బోడేపుడి వేణుమాధవ్, ముష్టికుంట్ల చిరునోముల సర్పంచ్ లు షేక్ బి జాన్ బి,ములకారపు రవి, పంచాయతీ కార్యదర్శి బంధం అర్జున్, ఉపాధిహామీ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.