తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హుజురాబాద్ బరిలో ఫీల్డ్ అసిస్టెంట్లు

Published: Friday August 06, 2021
వెల్గటూర్, ఆగస్ట్ 05 (ప్రజాపాలన ప్రతినిధి): రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల జె.ఎ.సి పిలుపు మేరకు హుజురాబాద్ లో జరిగే ఉప ఎన్నికలలో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసన తెలియజేయడానికి పోటీ చేస్తున్నట్లు వెల్గటూర్ మండలం ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షులు తనుగుల శ్రీనివాస్ గురువారం మండల శాఖ కిషన్ రావు పేట శ్రీ నాగపల్లి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 16 నెలల నుండి ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోని ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల జే.ఏ.సీ పిలుపు మేరకు వెల్గటూర్ మండల కమిటీ ఇద్దరు అభ్యర్థులను పోటీకి పంపాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కాసం సంతోష్ కుమార్, జిల్లా సలహాదారు గొల్ల సత్యం, ఉపాధ్యక్షురాలు కళ్ళు సత్యవాణి, ఆషాడపు సరిత, వైస్ ప్రెసిడెంట్ కుశనపల్లి కృపాకర్, మండలములోని ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.