నులిపురుగుల దినోత్సవ సందర్భంగా మందుల పంపిణీ

Published: Friday September 16, 2022
బోనకల్ ,సెప్టెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి:  మండల పరిధిలోని అళ్లపాడు గ్రామంలో నులిపురుగుల దినోత్సవం సందర్భంగా జడ్పీహెచ్ఎస్ హైస్కూలు ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్ర లలో పిల్లలందరికీ నులిపురుగుల నిర్మూలన కొరకు ఆల్బెండజోల్ మాత్రలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు ,పిహెచ్సి సూపర్వైజర్ రాజ్యలక్ష్మి, ఆశా కార్యకర్తలు  కళావతి , రత్నకుమారి ,ప్రధానోపాధ్యాయులు రమేష్, రవి, అంగన్వాడీ టీచర్లు పద్మ ,గౌరమ్మ, హుస్సేన్ బీ ,పంచాయతీ కార్యదర్శి పరశురామ్ పాల్గొన్నారు.