అనునిత్యం ప్రజల కొరకు కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువగా దగ్గరవుతున్న జడ్పిటిసి కామిర

Published: Wednesday November 09, 2022

బూర్గంపాడు ( ప్రజా పాలన.)

ఈరోజు బూర్గంపాడు మండలం సారపాక సుందరయ్య నగర్ లోని కాలనీలలో అనునిత్యం ప్రజల కొరకు కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువగా దగ్గరవుతున్న జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత. సుందరయ్య నగర్ లోని ఈరోజు వీధి వీధినా తిరుగుతూ ఇంటింటికి ప్రతి ఇంటి సమస్యను తెలుసుకుంటూ ప్రజలకు ఏది అవసరమో తెలుసుకుంటూ అనునిత్యం ప్రజల కొరకు కార్యక్రమం ద్వారా గత 13 రోజులుగా ప్రజా సమస్యల ధ్యేయంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిలో భాగంగానే రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి వ్యవస్థ గురించి ప్రజల్ని అడిగి తెలుసుకోవడం ద్వారా వారి యొక్క సమస్యలను ఇటు పంచాయతీ అధికారులకు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించడం జరిగినది. అదేవిధంగా సిసి రోడ్లు గురించి ఇంక రోడ్లు ఇంకా ఇతర సమస్యల గురించి అవసరమైతే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్తానని వారి ద్వారా సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది. అంతేకాకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు, సరిగా అందుతున్నాయా లేదా రైతుబంధు, మిషన్ భగీరథ వాటర్ వస్తుందా లేదా అని ప్రజల ద్వారా వాకప్ చేసి వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని వారు ప్రజలకు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి  శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు ఎల్లంకి లలిత, ఏసోబు ,   సాంబ రెడ్డి,బెజ్జంకి కనకాచారి, కృష్ణ, చుక్కపల్లి బాలాజీ, సాయిబాబా, కే మోహన్ రావు, బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.