అధికారులు టీబీజీకేఎస్ కు వత్తాసు పలుకొద్దు : ఐఎన్టీయూసీ నాయకుల డిమాండ్

Published: Wednesday September 22, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లం పెల్లి ఏరియాలో గుర్తింపు కార్మిక సంఘమైన టీబిజీకేఎస్ కు సింగరేణి సంస్థ అధికారులు వత్తాసు పలుకుతూ కార్మికులను ఇబ్బందికి గురి చేస్తున్నారని ఈ పద్దతిని మార్చుకోవాలని బెల్లంపల్లి ఏరియా ఐఎన్టీయూసీ నాయకులు అధికారులను డిమాండ్ చేశారు. మంగళవారం నాడు స్థానిక యూనియన్ కార్యాలయంలో మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా లో గుర్తింపు కార్మిక  సంఘం వారు చెప్పినట్లు వారి ఇష్టారీతిన సింగరేణి అధికారులను బ్లాక్ మెయిల్ చేసి వారి కార్యకర్తలకు నచ్చిన స్థానాలకు బదిలీలు చేస్తూ అదేవిధంగా ఎస్ & పి సి డిపార్ట్మెంట్లో వారికి నచ్చిన పోస్టుల్లో సంవత్సరాల తరబడి ఉంచుతూ కార్మికులందరినీ ఇబ్బంది పెడుతున్నారని, ఇలాంటి చర్యలతో సింగరేణి మొత్తంగా కార్మికులు తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత సంవత్సరం ప్రారంభమై ఆరు నెలల కాలం గడిచిన లాభాల వాటా ఇప్పటివరకు ప్రకటించకపోవడం చాలా విచారకరమని, రానున్న రోజుల్లో ఐఎన్ టి యు సి అధికారంలోకి తప్పక వస్తుందని ఇప్పుడు ఏదైతే కార్మికులను ఇబ్బంది పెడుతున్నారో రేపు వారికి కూడా అదే పరిస్థితి వస్తుందని గమనించాలని అన్నారు. అధికారులు టీబీజీకేఎస్ కు వత్తాసు పలకకుండా కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడాలని ఐ ఎన్ టి యు సి డిమాండ్ చేస్తుందని  అన్నారు. కార్మికులు కష్ట నష్టాలు ఓర్చి ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కార్మికులను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు సిద్ధం శెట్టి రాజమౌళి, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్, కౌన్సిలర్ గుజ్జ రవి ఏరియా కార్యదర్శి మాధవ కృష్ణా, కేంద్ర కమిటీ కార్యదర్శి కుక్కల ఓదెలు, ఏరియా నాయకులు పార్వతి సత్తయ్య, సంజీవరెడ్డి, తిరుపతి, స్వామి, మల్లికార్జున్, చంద్రశేఖర్, బి.కోటేశ్వర్ వర్క్ షాప్ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.