బీరు ఐలయ్య జన్మదిన వేడుకలు

Published: Monday June 07, 2021

ఆత్మకూరు, జూన్ 06, ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఆపద అంటే వెంటనే ఆదుకునే వ్యక్తి, బీర్ల ఫౌండేషన్ పేరుతో ఎంతో మంది పేద ప్రజలకు, కరోనా బాధితులకు సేవచేస్తున గొప్ప వ్యక్తి,చాలా గ్రామంలో వాటర్ ఫిల్టర్ ను ఏర్పాటు చేసి పేద ప్రజల దాహం తీరుస్తున్న మంచి మనసున్న నాయకుడు, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బీర్ల ఐలయ్య జన్మదినం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలను అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందికి, సన్మానం చేసి మాస్కులు, శానిటైజర్లు, మహిళ సిబ్బంది, ఏఎన్ఎమ్, ఆశా వర్కర్లకు చీరెలను అందించండం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండా మంగమ్మ శ్రీశైలం గౌడ్, జెడ్పిటిసి నరేందర్ గుప్తా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి,పిఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధులు,సర్పంచ్ లు జన్నాయికోడే నగేష్, సుబ్బురు వెంకన్న, ఉప సర్పంచ్ దొంతరబోయిన నవ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతాగని మల్లేష్ గౌడ్, నాయకులు కందడి అనంతరెడ్డి, బత్తిని ఉప్పలయ్య, ఎగ్గిరి యాదగిరి, కానుకుంట్ల యాదగిరి, బండ నర్సయ్య, మురారిషెట్టి మల్లేషం, కోరే మల్లేశ్, పంజాల భాస్కర్, ఎలగందుల మహేష్, చిత్తర్ల అనిల్, తవిటి రాజు, పంజాల భాస్కర్, గుండేగాని కిరణ్ గౌడ్, తొండల అనిల్ కుమార్, మహేష్, యాస సుభాష్, గడ్డం బాషా, పోలేపాక గణేశ్ నాయకులు బాసాని నవీన్, కోల మనోజ్, కోరే హరీష్, కందడి మధు, దీగోజు భరత్ తదితరులు పాల్గొన్నారు.