పత్తికి మద్దతు ధర కోసం ఈనెల 10న చలో కలెక్టరేట్. ...ఏఐకేఎస్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కొండగ

Published: Tuesday February 07, 2023
జన్నారం, ఫిబ్రవరి 06, ప్రజాపాలన:  
 
పత్తి కి క్వింటాలుకు 12వేలు మద్దత్తు దర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న చలో కలెక్టరేట్ నిర్వహించడం జరుగుతుందని  తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కొండగుర్ల లింగన్న తెలిపారు. సోమవారం 
మండలంలోని ధర్మారం గ్రామంలో పత్తి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పత్తి పంటకు ధరలేక పోవడంతో తాము పండించిన పంట ఇండ్లలో ఉంచుకొన్నామని రైతులు దుర్గం భానయ్య,దుర్గం పోషయ్య, దుర్గం దుర్గయ్య, పాల్తి రాజయ్య, తడకపల్లి రవిలు  పేర్కొన్నారు. దీంతో కొండగుర్ల లింగాన్న మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కోసం తెలంగాణ రైతు సంఘం పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తామని చెప్పి పంట చేతికందిన తర్వాత పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా , జిల్లాలో ఉన్న పత్తి రైతులను ఆదుకోవాలని మంచిర్యాల కలెక్టరేట్ ముందు ధర్నా చెయ్యడం జరుగుతుం దన్నారు. పత్తి రైతులు తమ బాధలను ప్రభుత్యం దృష్టికి తీసుకువెళ్లడానికి అధిక సంఖ్యలో పాల్గొని చలో కలెక్టరేట్ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాసం రాజన్న, మండల కార్యదర్శి దుర్గం దుర్గయ్య, పత్తి రైతులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.