గ్రామ దేవతలకు బోనమెత్తిన మహిళలు

Published: Saturday February 11, 2023
బోనకల్, ఫిబ్రవరి 10 ప్రజా పాలన ప్రతినిధి : మండల పరిధిలో లక్ష్మీపురం గ్రామంలో కొలువైన సీత సమేత రామచంద్ర గుడి ప్రతిష్ట శుక్రవారం జరిగింది. అదే విధంగా గ్రామ దేవతలు, ముత్యాలమ్మ, సత్యమ్మ ను ప్రతిష్టించారు.ఈ వార్షికోత్సవ సందర్భంగా గ్రామ దేవతలకు మహిళలు బోనమెత్తి మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు అమ్మవార్లకు సమర్పించి తమ వేడుకలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, మేడేపల్లి రామ కోటయ్య, ఆలయ ధర్మకర్త చైర్మన్ కిలారు రామకోటేశ్వరరావు, కిలారుచిన్న వెంకటేశ్వరరావు, బెజవాడ మల్లికార్జునరావు, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.