మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి జన్మదిన వేడుకలు ** బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్

Published: Monday December 26, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 25 (ప్రజాపాలన,ప్రతినిది) : మాజీ ప్రధాని, భారతరత్న, అటల్ బీహార్ వాజ్పేయి జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొత్తపెళ్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఆర్థిక సామాజిక అభివృద్ధి రక్షణ సంస్కరణలను పల్లె నుండి పట్టణ అనుసంధాన విధానాలతో భారత ప్రజలకు సుపరిపాలన అందించిన వాజ్పేయి చిరస్మరణీయులని కొనియాడారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సేర్ల మురళిదర్, ధోని శ్రీశైలం, మండల అధ్యక్షుడు గణేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు వందన, రాజేష్, సత్యం, సాయి కృష్ణ, దిగదేతుల రాధిక తదితరులు పాల్గొన్నారు.