కేంద్రం అనాలోచిత నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి..నిత్యావసర వస్తువులపై విధించిన జిఎస్టి పేద, మ

Published: Friday July 22, 2022

మంచిర్యాల బ్యూరో, జులై21, ప్రజాపాలన:

 

కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని ,నిత్యావసర వస్తువులపై విధించిన జిఎస్టి పేద, మధ్యతరగతి ప్రజలకు పెను బారంగా మారుతుందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. నిత్యావసర వస్తువులపై కేంద్రం విధించిన జిఎస్టి ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇందులో భాగంగా పార్లమెంట్ లో తెలంగాణ ఎంపిలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సైతం పార్లమెంట్ లో ప్లకార్డులు పట్టుకుని జిఎస్టీ కి వ్యతిరేకంగా ఎంపీలు నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై విధించిన జిఎస్టి తో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం పై తీవ్ర ప్రభావం చూపు తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహారించి నిత్య వసర వస్తూలపై జిఎస్టీ కొనసాగిస్తే రాబోయే రోజుల్లో బారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.