మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీగా రాజీనామాలు

Published: Thursday April 13, 2023

బోనకల్, ఏప్రిల్ 12 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు భారీగా బీఆర్ఎస్ పార్టీకి బుధవారం రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు నిరసనగా పొంగులేటి వెంటే మా పయనం అంటూ బోనకల్ మండలం లోని ఆ పార్టీ ప్రజాప్రతినిదులు,పార్టీ జిల్లా, మండల, గ్రామ నాయకులు సుమారు 250 మంది రాజీ నామాలు చేసినారు. రాజీనామా చేసిన వారిలో బోనకల్ సర్పంచ్ బుక్కా సైదా నాయక్, బోనకల్ ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ, రాపల్లి సర్పంచ్ మందడపు తిరుమలరావు, జానకిపురం సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు, ఆళ్ళపాడు గ్రామ ఉపసర్పంచ్ మలాది గంగమ్మ, రావినూతల సొసైటీ డైరెక్టర్ తోటకూర వెంకటేశ్వర్లు, బోనకల్ మండల రైతు సమన్వయ సమితి సభ్యులు ఉమ్మినేని కృష్ణ, చావా లక్ష్మణరావు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కళ్యాకపు నాగేశ్వరరావు,కోయినేని ప్రదీప్,బండి వెంకటేశ్వర్లు, ముష్టికుంట్ల గ్రామ పంచాయితీ వార్డ్ మెంబర్ బోయినపల్లి మురళి,సాధినేనిరాంబాబు,బీరెల్లి కృష్ణ,గోడుగు కృష్ణ,భాగం నాగేశ్వర రావు,కోరివి సురేష్,ఊటుకురి బాలకృష్ణ,బంధం తిరుపతి రావు, గుగులోతు రాములు,గాలికృష్ణ,కోమ్మినేని నాగేశ్వరరావు, వడ్డే పోయిన సతీష్, మోదుగు కోటయ్య, ఇరుగు కృష్ణ, బీరెల్లి వాసు, చింతలచెరువు లక్ష్మీనారాయణ, చిట్టూరి వెంకటేశ్వర్లు, గాలి రాము, చిగురుపాటి కృష్ణ, షేక్ పాషా, చిలకా శివ, భాగం మురళి, పరస గాని గోపి, పెద్ద బీరవల్లి సొసైటీ డైరెక్టర్ చిలకా దాసు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేశారు.