కొత్తగూడెంనకు మెడికల్ కాలేజీ ప్రదాత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకి సత్కారం

Published: Wednesday June 02, 2021
భద్రాద్రి కొత్తగూడం జిల్లా, ప్రజాపాలన ప్రతినిధి : గత దశాబ్దాల కాలంగా కొత్తగూడెం మనకు చిరకాల స్వప్నంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీని తన అకుంఠిత దీక్షతో అవిరళ కృషితో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలుమార్లు విజ్ఞప్తి చేసి కొత్తగూడెం నకు మెడికల్ కాలేజీ యొక్క ఆవశ్యకతను  విశదీకరించి ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి మంజూరు చేయించిన ఘనత కొత్తగూడెం శాసన సభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావుగారి దేనని భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మద్దెల శివ కుమార్ మరియు గౌరవ అధ్యక్షులు కూ సపాటి శ్రీనివాస్ లు ఉద్ఘాటించారు 01 06 2021. నాడు భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘ నాయకులు వనమాగారి స్వగృహానికి వెళ్లి కొత్తగూడెం వరకు మెడికల్ కాలేజీ మరియు నర్సింగ్ కాలేజీ ని మంజూరు చేయించినందుకు శ్రీ వన మాను పూలమాలలు బొకేలు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా మద్దెల మరియు కూసపాటి మాట్లాడుతూ  గిరిజన ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు మెడికల్ కాలేజీ మంజూరి గొప్ప వరం అని దీనివలన గిరిజన వర్గాలు బడుగు బలహీన వర్గాల పేద వర్గాలకు వైద్య విద్య అందుబాటులో ఉంటుందని ఇక్కడి విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి ఎంతో వ్యయప్రయాసలకోర్చి వైద్య విద్యను అభ్యసించే ప్రయాసము మాని ఇక్కడే వైద్య విద్యను అభ్యసించడం వలన ఇక్కడి డాక్టర్లు గా తయారై ఈ ప్రాంతానికే వైద్య సేవలు అందించడం వలన వైద్య సేవలు ఎండమావిగా ఉన్నటువంటి రిమోట్కు గ్రామాలలో వైద్యం అందుబాటులో ఉంటుందని వారు ఆనందం వ్యక్తం చేశారు అంతేగాక సింగరేణి గనులు కేటీపీఎస్ బి టి పి ఎస్ భద్రాచలం పేపర్ బోర్డ్ స్పాంజ్ ఐరన్ హెవీ వాటర్ ప్లాంట్ నవభారత్ తదితర పరిశ్రమలు విరాజిల్లుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పడితే ఇది ఒక పారిశ్రామిక హబ్ గా విలసిల్లుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న అపర భగీరధుడు అభివృద్ధి సాధకుడు శ్రీ వర్మ గారికి వారు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేసినారు శ్రీ వనమా గారిని సత్కరించి అభినందించిన వారిలో మద్దెల మరియు కూ సపాటి తో పాటు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మందా హనుమంతు సలహాదారులు కోలపూడి ధర్మరాజు దిశా కమిటీ సభ్యులు గిడ్ల పరంజ్యోతి రావు సంఘ నాయకులు టీ ధనరాజు ఉప సర్పంచ్ దుర్గేష్ నేరెళ్ల రమేష్ మద్దెల ఆదర్శ్ మనోహర్ తదితరులు ఉన్నారు