మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంఈఓ మెమో

Published: Thursday June 30, 2022

అబ్దుల్లాపూర్మెట్ మండలం మరియు హయత్ నగర్ మండల్ మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఎన్ యు ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఎం ఈ ఓ వీర్య నాయక్ కి  మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటి జిల్లా నాయకులు ఏర్పుల నరసింహ  హాజరై మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు గత సంవత్సరం డిసెంబర్ నుండి ఇప్పటివరకు గుడ్ల డబ్బులు రాలేదు ఫిబ్రవరి నుండి మిస్ బిల్లు రాలేదు, తెలంగాణ వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలు మారిపోతాయి అనుకుంటే, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బిల్లులు పెంచకపోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు చేసుకొని వడ్డీలు కట్టలేక పరిస్థితుల్లో దీనమైన స్థితిలో ఉన్నారు. నెల నెల జీతాలు ఇవ్వకుండా, బిల్లులు ఇవ్వకుండా కార్మికులతో ఎట్టి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి, మీ ఇంట్లో తిని మా ఇంట్లో పని చేయండి, అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
కావున మధ్యాహ్న భోజన కార్మికులకు వంటకు సంబంధించిన, గ్యాస్, కట్టెలు, వంట సామాన్లు ప్రభుత్వమే ఇవ్వాలి, ప్రతి నెల జీతాలు, బిల్లులు ఇవ్వాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో వీరి సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దిగిపోయేంతవరకు ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు నిర్మల, రమాదేవి, యాదమ్మ రంగమ్మ, కమలమ్మ సరూప, లావణ్య, మాధవి పాల్గొన్నారు.