ఉద్యోగాలకు సిద్దమవుతున్న బిసి అభ్యర్థుల కోసం స్టడీ సర్కిల్ -ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషనరెడ్

Published: Friday September 16, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 15 ప్రజాపాలన ప్రతినిధిప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న బి.సి. యువతకోసం పట్నం నియోజకవర్గ కేంద్రంలో బిసి స్టడీసర్కిల్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి క్రిషకరెడ్డి తెలిపారు. బిసి సంక్షేమశాఖ అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఎమ్మెల్యే వెంటనే అడ్మీ - షన్లు పూర్తి చేసి తరగతులు ప్రారంబించాలని వారిని ఆదేశించారు. గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు సిద్దమవుతున్న బిసి యువత వెంటనే ఈ స్టడీసెంటర్లో చేరాలని ఎమ్మెల్యే సూచించారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన బిసి అభ్యర్థులు నేరుగా చేరవిదంగా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. రెండు బ్యాక్లలుగా రెండు నెలల పాటు ఉచిత శిక్షణ అందివ్వమన్నట్లు, స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇబ్రహింపట్నం నియోజకవర్గ బిసి యువతకు ఉపయోగ పడేవిధంగా బిసి సంక్షేమశాఖ ద్వారా ఈ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయించినందున బిసి యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. శిక్షణ పొందగోరే బిసి అభ్యర్థులు 9640 236249, లేదా 9866 16639బ ఫోన్ నెంబర్లలో సంప్రదించి వెంటనే బేరాలని చెప్పారు. బిసి సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి. విద్య, ఎంపిపి కృపేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి, బిసిడెవలప్ మెంట్ ఆఫీసర్లు రమేష్, నీరవారెడ్డి, ముజాయిద్వాన్, హాస్టల్ అధికారులు భవదీయ సమీర, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.